Awareness conference | ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

Awareness conference | ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

Awareness conference | లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర స్థాయి ఎన్నికల పరిశీలకులు పీ మనోహర్ అన్నారు. ఈ రోజు పట్టణంలోని కే ఎస్ ఆర్ ఫంక్షన్ హల్లో మొదటి విడతలో హాజీపూర్, లక్షేట్టిపేట్, దండేపల్లి, జన్నారం మండలాల్లో జరుగుతున్న ఎన్నికలలో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థులకు అవగాహన సదస్సు(Awareness conference) నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులందరూ సామరస్య పూర్వకంగా ఎన్నికల నిర్వహణకు సహకారం అందించాలని కోరారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయవద్దని కోరారు. నియమ నిబంధనలు పాటించకపోతే పలు రకాల కేసులు సైతం నమోదు అవుతాయని తెలిపారు. అభ్యర్థులందరూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలకు జరుపుకోవాలని, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా పోలీస్ వారు సూచించి ఇచ్చిన సమయంలోనే సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి పోలీస్ వారికి సహకరించాలని, పోలీస్ శాఖ సూచనలు గమనించాలని కోరారు.

ముఖ్యంగా 11న ఎన్నికలు, ఫలితాల అనంతరం ఎలాంటి ర్యాలీలు(rallies) గాని సమావేశాలకు గాని అనుమతి లేదని, ఇది గమనించి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏం పీ డీ ఓ సరోజ,లక్షేట్టిపేట్, దండేపల్లి, జన్నారం తహశీల్దార్లు దిలీప్ కుమార్, శ్రీనివాస్ రావు దేశ్ పాండే, రోహిత్ దేశ్పాండే, రాజ మనోహర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు స్వరూప్ రాజ్, గోపతి సురేష్, తహసీద్దీన్, అనూష, తిరుపతి, సహాయ వ్యయ పరిశీలకులు, మాస్టర్ ట్రైనర్లు, సర్పంచ్ అభ్యర్థులు పాల్గొన్నారు.

Leave a Reply