MLA | అయ్యప్ప అనుగ్రహం ఉండాలి..

MLA | అయ్యప్ప అనుగ్రహం ఉండాలి..

  • మహా పడిపూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి…

MLA | నిజాంపేట, ఆంధ్రప్రభ : హరిహర పుత్రుడు అయ్యప్ప అనుగ్రహం నిజాంపేట మండల ప్రజలపై ఉండాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి(Ex MLA Padma Devender Reddy) అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గురుస్వామి రంజిత్ గౌడ్, జన్మదినం సందర్భంగా గ్రామ పురహితులు వేలేటి విశ్వేశ్వర శర్మ ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి హాజరయ్యారు.

అయ్యప్ప స్వాములు భజన సంకీర్తన మధ్య స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం అయ్యప్ప స్వాములు అన్నదాన ప్రసాదాన్నిస్వీకరించారు.

ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామంలో అయ్యప్ప స్వామి మాలాధారణ ధరించి 45 రోజులు(45 days) కటోర ఉపవాస దీక్షలు చేస్తూ స్వామివారికి సేవలందించడం గొప్ప విషయమని, అలాగే దాతల సహకారంతో అయ్యప్ప స్వాములు అయ్యప్ప ఆలయాన్ని నిర్మించుకోవడం శుభ పరిణయమ‌న్నారు.

ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి(Ayyappa Swamy) కృపతో మెదక్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు యాద గౌడ్, బాలకృష్ణ, నాయిని వెంకటేశం, నవీన్ రెడ్డి, బాల్ రెడ్డి, రాజిరెడ్డి, నవీన్ గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply