ACB | ఏసీబీ సోదాలు
- ల్యాండ్ రికార్డ్స్, ఏడీ కార్యాలయంలో తనిఖీలు
ACB | రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్(Land Records) అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైన నేపథ్యంలో ఏసీబీ ఈ రోజు ఉదయం నుంచే విస్తృత సోదాలు ప్రారంభించింది. ఏసీబీ డీఎస్పీ చలపతి ఆధ్వర్యంలోని అధికారులు రంగారెడ్డి కలెక్టరేట్‌లోని ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కార్యాలయంలో ఫైళ్లు, రికార్డులను పూర్తిగా పరిశీలిస్తున్నారు.
మహబూబ్‌నగర్‌లో రైస్ మిల్లు, అనేక షెల్ కంపెనీల(Shell Companies) పేరుతో వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.




