AP | పాడి రైతులకు సదవకాశం…

AP | పాడి రైతులకు సదవకాశం…
- పశువుల హాస్పిటల్ ఏర్పాటు హర్షణీయం
- పాడి పరిశ్రమ అభివృద్ధికి దోహదం
- ప్రభుత్వ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు..
- కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : పాడి పరిశ్రమ అభివృద్ధికి ఎంతో దోహదపడే పశువుల హాస్పిటల్ ఏర్పాటునకు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవడం శుభపరిణామనే కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు.
రాష్ట్రంలో పాడి పరిశ్రమ మరింత అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్న ఆయన పాడి రైతులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బుధవారం ఆయన ఆంధ్రప్రభ తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి రూ.10 లక్షల వ్యయంతో ఒక పశువుల హాస్టల్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలపడం ఎంతో హర్షణీయం అన్నారు.
పాడి పరిశ్రమ అభివృద్ధికై ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వానికి, లక్షా యాభై వేల పాడి రైతుల సంస్థ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు.
వ్యవసాయంతో పాటుగా పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చొరవతో ప్రభుత్వం నుండి నిరంతరంగా లభిస్తున్న ప్రోత్సాహం మార్గదర్శకతకు ధన్యవాదాలు తెలుపుతూ… రాష్ట్రంలోని పాడి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పశువుల సామూహిక నిర్వహణ ద్వారా పని, వ్యయ భారం తగ్గించుకోవడంతో పాటు, ఉత్తమ పశుపోషణ ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగుపరచి, ఆదాయం పెంపొందించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
