Chairman | దివ్యాంగులకు ప్రేమతో..

Chairman | హనుమాన్ జంక్షన్, ఆంధ్రప్రభ : దివ్యాంగులను ప్రేమతో ఆదరించాలని, వారిపట్ల వివక్షత చూపవద్దని కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు(Chalasani Anjaneyulu) పేర్కొన్నారు. హనుమాన్ జంక్షన్ అప్పనవీడులోని ఓ ఆశ్రమంలో బుధవారం జాతీయ వికలాంగుల దినోత్సవం(National Day of Persons with Disabilities) ఘనంగా జరిగింది. కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు ఆశ్రమంలో బాల బాలికలతో కేక్ కట్ చేశారు. అనంతరం వారికి పాలు, బిస్కెట్లు, కేకులు, అరటిపండ్లు పంపిణీ చేశారు. ఆటల పోటీల్లో(Games competition) గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న వెంకటస్వామి, మాధవి లతలను ఆంజనేయులు శాలువాతో సత్కరించారు.

Leave a Reply