progress | రామగుండం ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణకు పురోగతి
- ఎంపీ వంశీకృష్ణ
progress | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : రామగుండం ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు ప్రయత్నాలు కొంత ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం గత రెండేళ్లుగా నిరంతరం కృషి చేస్తున్న పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ(Gaddam vamshikrishna) మరో కీలక అడుగు వేశారు. ఈ సందర్భంగా ఆయన నిన్న ఢిల్లీలో కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడును కలసి ప్రాజెక్టు పురోగతిపై చర్చలు జరిపారు.
ఈసందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వంశీకృష్ణ మాట్లాడుతూ… “రామగుండం ప్రాంతం భౌగోళికంగా, పారిశ్రామికంగా కీలక కేంద్రం. ఇక్కడ ఎయిర్‌పోర్ట్(Airport) ఏర్పాటైతే సింగరేణి ప్రాంతం, పెద్దపల్లి, మంచిర్యాల్, ఆదిలాబాద్ జిల్లాలు అభివృద్ధి దిశగా (Towards development )దూసుకుపోతాయి,” అని తెలిపారు.
కొండల కారణంగా మొదటి సైట్ రిజెక్ట్..
మొదట ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) పరిశీలించిన సైట్‌లో కొండలు, భౌగోళిక అడ్డంకులు ఉండటంతో ఆ ప్రదేశాన్ని రద్దు చేసినట్లు ఎంపీ చెప్పారు. “అయితే మేము మళ్లీ వారిని ఒత్తిడి చేసి, కొత్త లొకేషన్‌పై ప్రీ-ఫీజిబిలిటీ స్టడీ చేయించేలా చర్యలు తీసుకున్నాం,” అని వివరించారు.
రూ.50 లక్షలు స్టడీకి మంజూరు..
రామగుండం ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.50 లక్షలు విడుదలైనట్లు ఎంపీ(MP) వెల్లడించారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) నాయకత్వంలో సెంటర్‌కు ఈ మొత్తాన్ని చెల్లించాం. దీని ద్వారా ప్రీ-ఫీజిబిలిటీ స్టడీ వేగవంతమవుతుంది,” అని వంశీకృష్ణ తెలిపారు.
డిసెంబర్ 3, 4న ఏఏఐ బృందం రానుంది
“సివిల్ ఏవియేషన్ మంత్రి నాకు హామీ ఇచ్చారు. డిసెంబర్ 3 లేదా 4న ఏఏఐ బృందం రామగుండం ప్రాంతాన్ని సందర్శించి కొత్త ల్యాండ్ సర్వే చేయనుంది. ఆ తర్వాత స్టడీ నివేదిక సిద్ధమైతే భూసేకరణ, తుది నిర్ణయాలు(Decisions) తీసుకునే అవకాశం ఉంటుంది,” అని ఎంపీ వివరించారు. ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు(Airport project) ద్వారా రామగుండం, సింగరేణి కార్మికులు, వ్యాపార వేత్తలు, యువతకు ఎన్నో అవకాశాలు వస్తాయని ఎంపీ పేర్కొన్నారు.“ఇది రామగుండం ప్రాంతానికి ఒక భారీ ఆర్థిక అవకాశాన్ని(Huge financial opportunity) తెస్తుంది. అందరూ సహకరించాలి. మీ ఆశీర్వాదాలతో రామగుండం ఎయిర్‌పోర్ట్ వచ్చేవరకు నేను కృషి చేస్తాను, ” అని వంశీకృష్ణ ధృఢంగా చెప్పారు.

