Center | నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

Center | నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

రాష్ట్ర పంచాయతీ ఎన్నికల పరిశీలకులు వెంకట్

Center | తాంసి, ఆంధ్రప్రభ : సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు వెంకన్న సూచించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కప్పర్ల, తాంసి, బండల్ నాగపూర్ క్లస్టర్ల‌ నామినేషన్ (Nomination) కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ వివరాలపై ఆరా తీశారు. నామినేషన్ ఏర్పాట్ల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా భ‌ద్ర‌తా ఏర్పాట్ల గురించి ఎస్సై జీవన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు ఎంపీడీఓ మోహన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, ఎస్సై జీవన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఉన్నారు.

Leave a Reply