CPM | బంద్..

CPM | ముత్తుకూరు, ఆంధ్రప్రభ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజానాట్యమండలి కళాకారుడు, సీపీఎం (CPM) పార్టీ యువ నాయకులు కే పెంచలయ్యను గంజాయి బ్యాచ్ దారుణంగా హత్య (brutally murdered) చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన పై రాష్ట్ర సీపీఎం పార్టీ కమిటీ పిలుపు మేరకు సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండల కేంద్రంలో ఈనెల రెండవ తేదీన బంద్ నిర్వహిస్తున్నట్లు జిల్లా సీపీఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు గోగుల శ్రీనివాసులు అన్నారు.

సోమవారం మండల కేంద్రం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అనుబంధ సంఘాలు సమావేశమై పెంచలయ్య (Penchalayya) చిత్రపటానికి ఘన నివాళులర్పించి బంద్ నిర్వహణ పై చర్చించారు. ప్రజలకు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి గడ్డం అంకయ్య, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు నక్కా రాధయ్య, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply