BRS| బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు
- 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం
- పార్టీ మండల అధ్యక్షుడు హనుమండ్ల జగదీష్
BRS| తిర్యాణి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల (6 guarantees) అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఆ పార్టీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగుచెంది మండల ప్రజలు కాంగ్రెస్ (Congress) కు రానున్న పంచాయతీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు హనుమండ్ల జగదీష్ అన్నారు.
మండలంలోని తలండీ గ్రామపంచాయతీలో గల కోయతెలండి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం దిందర్శ, ఊయిక రాజు, నైతం జైత్, ఆత్రం తిరుపతి, నైతం సోనీరావు, ఊయిక గుణవంత్ రావు (Ooika Gunavanth Rao), కొమరం అర్జున్, నైతం భగవంత్ రావు, ఆత్రం గంగారం, నైతం శంకర్, సోయం మెంగరావుతో పాటు మరో 50మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ పెద్దలు బి.ఆర్.ఏస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.
అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇరుకులో పడిందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగుందని మండలంలోని ప్రజలంతా (All the people of Mandal) అనుకుంటున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎక్కడికెళ్లిన తమని ప్రజలు సాధారంగా ఆహ్వానిస్తున్నారని తెలిపారు. దీంతో తమ గెలుపు ఖాయమైనట్లేనని మండలంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
తలండి గ్రామపంచాయతీ సర్పంచ్ గా (As Sarpanch) బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి ఆత్రం దిందర్ష అని పేర్కొన్నారు. తలండి గ్రామపంచాయతీ ప్రజలు దీవించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ టెంట్ శ్రీనివాస్(PACS Vice Chairman Tent Srinivas), మాజీ జెడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ ఆత్రం సుజాత మాజీ ఉపసర్పంచ్ తోట లచ్చన్న, పార్టీ నాయకులు మల్లేష్, కిలిశెట్టి శంకర్, బుర్ర మధుకర్, దేవేందర్, సంతోష్, లక్ష్మణ్ గౌడ్, కుమార్, వినోద్, తదితరులున్నారు.

