Blood donation | తండ్రి నడవడి… కొడుకు సేవాభావం

Blood donation | తండ్రి నడవడి… కొడుకు సేవాభావం

  • నిస్వార్థ సేవకు నిదర్శనం
  • 24వ సారి రక్తదానం చేసిన చుంచు అజయ్

Blood donation | తిర్యాణి, ఆంధ్రప్రభ : సేవాభావం పుస్తకాల్లో కాదు… ఇంట్లోనే నేర్చుకునేది. తిర్యాణి మండలం(Tiryani Mandal) కన్నెపల్లి గ్రామానికి చెందిన చుంచు అజయ్ చేసిన తాజా రక్తదానం ఈ మాటలు నిజమని నిరూపించింది. తిర్యాణి మండల పీఏసీఎస్ చైర్మన్‌గా ఉన్న చుంచు శ్రీనివాస్ (Chunchu Srinivas) ఎప్పుడూ సామాజిక సేవలో ముందుంటారని స్థానికులు చెబుతుంటారు. తండ్రి నడవడినే మార్గదర్శకంగా తీసుకున్న అజయ్‌ కూడా అదే విలువలను ఆచరిస్తున్నాడు.

గచ్చిబౌలి ఒమెగా ఆసుపత్రిలో అత్యవసరంగా ఓ పాజిటివ్ ప్లేట్‌లెట్స్(Positive platelets) అవసరం ఏర్పడగానే, పలువురు వెనుకంజ వేస్తుండగా.. హైదరాబాద్ లో(In Hyderabad) చదువుతున్న అజయ్ వెంటనే ఆసుపత్రికి చేరుకొని ప్లేట్‌లెట్స్ దానం చేశాడు. ఇది అతడి 24వ రక్తదానం కావడం విశేషం. ఇంటి నుంచి సేవ, మానవత్వం నేర్చుకుంటే… ఎక్కడైనా ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు సహాయం చేయడం సహజంగా (Naturally) మారుతుందని అజయ్ చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తండ్రి చూపిన మార్గంలో అజయ్ ముందుకు సాగడం గ్రామస్తులకు గర్వంగా మారింది. సేవా విలువలు తరతరాలకు ఎలా చేరాలన్న దానికి ఈ ఘటన నిదర్శనమని వారు పేర్కొన్నారు.

Leave a Reply