TG| వెంటనే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి

TG| వెంటనే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి

  • నారాయణపేట జల సాధన సమితి జిల్లా కో -కన్వీనర్ నర్సింహా

TG| ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా రైతులకు సాగునీరు, తాగునీరు అందించే మక్తల్ – నారాయణ పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు వెంటనే పరిహారం చెల్లించి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని నారాయణపేట జిల్లా జల సాధన సమితి జిల్లా కో కన్వీనర్ హెచ్.నర్సింహా డిమాండ్ చేశారు. ఆదివారం ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సోమవారం మక్తల్ లో జరిగే బహిరంగ సభకు వస్తున్న సందర్భంగా జిల్లా రైతులు ఘనంగా స్వాగతం పలకాలని కోరారు. ఈ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు మంత్రి వాకిటి శ్రీహరి కృషితో ఎకరాకు రూ. 20 లక్షలు ఇస్తామని ప్రకటించిన సీఎంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వెంటనే ఈ రూ. 20 లక్షల నష్ట పరిహారం రైతుల అకౌంట్లో జమ చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి సాగునీరు అందించాలని కోరారు. ఈ ఎత్తిపోతల పథకం కోసం భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనాలు తెలిపారు. అదే విధంగా భూ నిర్వాసితులకు ఎకరాకు రూ. 20 లక్షలు ఇప్పించిన మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణ పేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డిలకు జిల్లా రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జల సాధన సమితి నాయకుడు దొరోల్ల కృష్ణయ్య, వాకిటి కిష్టప్ప, నిమ్మకాయల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply