Prakasam | రామాయపట్నం పోర్టు ప్రకాశం జిల్లాకే..

Prakasam | రామాయపట్నం పోర్టు ప్రకాశం జిల్లాకే..

Prakasam | రామాయపట్నం పోర్టు ప్రకాశం జిల్లాకే..

  • విమానాశ్రయం, హార్బర్‌ తోపాటు మరికొన్ని సంస్ధలు రాక
  • పారిశ్రామికవేత్తలకు భారీ ఊరట
  • జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పరుగులు పెట్టనున్న అభివృద్ది

కూటమి ప్రభుత్వం జిల్లా పునర్‌ వ్యవస్ధీకరణ చేయడంతో అభివృద్దిలో రూపురేఖలే మారనున్నాయి. ప్రధానంగా నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు ప్రకాశంజిల్లాలో కలవడంతో జిల్లా అభివృద్ది పరుగులు పెట్టనుంది. ఇప్పటివరకు ప్రకాశంజిల్లాకు పోర్టు లేదని అన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపధ్యంలోప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆ ఆందోళన కూడా లేకుండా పోయింది. జిల్లాకు రామాయపట్నంపోర్టు, విమానాశ్రయం, హార్బర్‌ వంటి పెద్ద ప్రాజెక్టులు రావడంతో పారిశ్రామికీకరణ తో పాటు నిరుద్యోగ సమస్య కూడా తీరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఆరు నియోజకవర్గాలతో విస్తరించింది. ఏది ఏమైనప్పటికీ రానున్నరోజుల్లో ప్రకాశం జిల్లా అభివృద్దిలో పూర్తిస్ధాయిలో పరుగులు పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుంది.

ఒంగోలు బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయడంతో ప్రకాశం జిల్లా అభివృద్దిలోరూపురేఖలే మారనున్నాయి. ఆరు నియోజకవర్గాలతో ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జిల్లాలోని కందూరు నియోజకవర్గాన్ని, బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేసారు.

దీంతో కొత్తగా కందుకూరు, కొండపి, ఒంగోలు, సంతనూతలపాడు, అద్దంకి, దర్శి నియోజకవర్గాలను కలుపుతూ ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేసారు. దీంతో నూతనంగా ఏర్పడ్డ ప్రకాశం జిల్లాలో కోస్తాతీర ప్రాంతం విస్తారంగా విస్తరించి ఉంది. కందుకూరు నియోజకవర్గంలోని రామాయపట్నం పోర్టు ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలోఉంది.

Prakasam

మారిన పరిస్ధితుల నేపధ్యంలో ఆ పోర్టు ప్రకాశం జిల్లాలో విలీనం అయింది. ఈ నేపధ్యంలో ప్రకాశం జిల్లా పారిశ్రామికంగా వేగం పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈపాటికే రామాయపట్నం పోర్టు నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం పోర్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టిసారించిన నేపధ్యంలో ఆప్రాంతంలోని భూముల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. రామాయపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే దాని అనుబంధ పరిశ్రమలన్నీ పూర్తిగా ఆయా ప్రాంతంలో పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలోని గ్రానైట్‌, ఆక్వారంగాలతో తోపాటు ఇతర రంగాలకు చెందిన ఉత్పత్తులు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం , చెన్నై పోర్టుల నుండి ఇతరదేశాలకు ఎగుమతులు అవుతున్నాయి. కాగా రామాయపట్నం పోర్టు నిర్మాణం జరిగితే ఆయాప్రాంతాల్లోని ఉత్పత్తులన్నీ ఈపోర్టునుండే ఎగుమతులు కానున్నాయి.

దీంతో జిల్లాకు పోర్టుద్వారా అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పరిశ్రమలు ఆ ప్రాంతంలో ఏర్పాటు కానుండటంతో నిరుద్యోగ సమస్య కూడా తీరే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగులు ఇతరరాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్ధితులు ఉన్నాయి.

రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్ధితులు ఉండవని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రకాశం జిల్లాకు రామాయపట్నం పోర్టు తలమానికంగా నిలవనుంది. ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లాలోని విమానాశ్రయం ,హార్బర్‌ నిర్మాణాలు కూడా త్వరలో జరిగే అవకాశాలున్నాయి. ఈపాటికే విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి భరత్‌ సంస్ధకు చెందిన ప్రతినిధులు ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఆలూరు, అల్లూరు గ్రామాల్లో ప ర్యటించి వెళ్ళడం జరిగింది.

Prakasam | కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు

అదే విధంగా గతంలో కేంద్ర విమానయాన సంస్ధ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్‌, ఇతర శాఖల అధికారులు విమానాశ్రయ ఏర్పాటు ప్రతిపాదిత స్ధలాలను పరిశీలించి వెళ్ళడం జరిగింది. ఆప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు భూములు అనుకూలంగా ఉన్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు కూడా అధికారులు సమర్పించడం జరిగింది.

ఆప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటైతే జిల్లా మరింతగా అభివృద్ది చెందే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పారిశ్రామిక వేత్తలతో పాటు వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఇతరదేశాలకువెళ్ళాలంటే హైదరాబాదు లేదా చెన్నై వెళ్ళాల్సిన పరిస్ధితులు ఉన్నాయి. ప్రధానంగా జిల్లాలో గ్రానైట్‌, ఆక్వా పొగాకు రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఎక్కువసంఖ్యలో ఉన్నారు.

వారందరికీ జిల్లాలో ఏర్పాటు చేయబోయే విమానాశ్రయం ఎంతగానో ఉపకరించనుంది. ఈనేపధ్యంలో పారిశ్రామికంగా కూడా అభివృద్ది చెందే అవకాశాలున్నాయి. కాగా ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని కొత్తపట్నం, పల్లెపాలెం వద్ద హార్బర్‌ నిర్మాణం కూడా జరగనుంది. ఈ హార్బర్‌ నిర్మాణం జరిగితే ఆప్రాంతం అన్నివిధాలా అభివృద్ది చెందే అవకాశాలున్నాయి.

హార్బర్‌ అనుబంధ పరిశ్రమలు జిల్లాకు వచ్చే అవకాశాలు ఉండటంతో ఆరంగంలో జిల్లా అభివృద్ది చెందే అవకాశాలున్నాయి. ఈపాటికే కొత్తపట్నం తీరప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గపరిధిలోని గుండమాల నుండి మడనూరు వరకుసాగరమాల కింద రోడ్లను ఏర్పాటు చేయనున్నారు.

దీంతో కోస్తాతీరప్రాంతంలో రోడ్ల విస్తరణ కూడా జరగనుంది. అదేవిధంగా పర్యాటక పరంగా కూడా జిల్లాలోని సముద్రతీరప్రాంతం అభివృద్ది చెందే అవకాశాలున్నాయి. ఏది ఏమైనప్పటికీ రామాయపట్నం పోర్టు, విమానాశ్రయం, హార్బర్‌ నిర్మాణాలతో జిల్లాఅభివృద్ది రూపురేఖలుసమూలంగా మారే అవకాశాలున్నాయి. ఆవైపుగా కూటమి ప్రభుత్వం జిల్లా అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించింది.

Click Here To Read రైతు సంక్షేమానికి ప‌థ‌కాల అమ‌లు

Click Here To Read More

Leave a Reply