Transport | ఆకస్మిక తనిఖీలు..

Transport | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్(Assistant Motor Vehicle Inspector) పల్లపు అంకమ్మరావు కళాశాల పాఠశాల బస్సులను ఆకస్మిక తనిఖీ నిర్వహించి అనుసరిస్తున్న నిబంధనల పై సంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లా రవాణా శాఖ అధికారి టి.పరంధామ రెడ్డి(T. Parandhama Reddy,), ఎం వి ఐ రంగారావు ఆదేశాల మేరకు పట్టణంలోని అన్ని కళాశాల పాఠశాల బస్సుల పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పల్లపు అంకమ్మరావు తెలిపారు. స్థానిక పోలేరమ్మ గుడి(Poleramma Gudi) వద్ద ఈ రోజు ఆయన పాఠశాల కళాశాల బస్సులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏఎంవిఐ అంకమ్మరావు మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా అన్ని కళాశాలలు, పాఠశాలల బస్సులు నడపాలని ఆదేశించారు. ప్రతి బస్సు తప్పనిసరిగా ఫిట్నెస్(Fitness) కలిగి ఉండాలన్నారు. అలాగే బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎగ్జిట్ డోర్, ఫైర్ సేఫ్టీ, సిలిండర్లు విధిగా ఉంచాలన్నారు.

బస్సు ప్రయాణ సమయంలో డ్రైవర్ తో పాటు ధ్రువీకరణ పత్రాలు, సేఫ్టీ ప్రికాషన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన కళాశాల, పాఠశాల బస్సుల పై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తనిఖీలు నిరంతరం చేస్తూనే ఉంటామని యాజమాన్యం అప్రమత్తంగా ఉంటూ బస్సుల రవాణా(Bus Transport) నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డ్రైవర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి కిషోర్ బాబు, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply