Telangana| కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

Telangana| కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

Telangana| పెద్దవంగర, ఆంధ్రప్రభ : పేదల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి (Mamidala Yashaswini Reddy), టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి (Hanumandla Jhansi Rajender Reddy) అన్నారు. గురువారం తొర్రూర్ లోని మండల పార్టీ కార్యాలయంలో రామచంద్రు తండా బీఆర్ఎస్ నాయకులు మాజీ ఉపసర్పంచ్ జాటోత్ అమల సక్రు నాయక్, మాజీ వార్డ్ మెంబర్ జాటోత్ భోజ్యా నాయక్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. త్వరలో రామచంద్రు తండా నుండి పదుల సంఖ్యలో కాంగ్రెస్ గూటికి చేరుతారని మాజీ ఉప సర్పంచ్ జాటోత్ అమల సక్రు నాయక్ అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ … కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఫ్రీ బస్, 200యూనిట్ల ఉచిత కరెంట్, గ్యాస్ సబ్సిడీ, సున్నా వడ్డీకే రుణాలు, రూ.10 లక్షల ఆరోగ్య శ్రీ, రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయింది. గత పదేండ్ల బీఆర్ఎస్ (BRS) వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లో వివరించి ఆయా గ్రామాలలో నిలబడిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, రామచంద్రు తండా అధ్యక్షుడు జాటోత్ వెంకన్న, జాటోత్ శివ, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply