STU | స‌భ్య‌త్వానికి రాజీనామా…

STU | స‌భ్య‌త్వానికి రాజీనామా…

STU | కడెం నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ : ఎస్‌టీయు రాష్ట్ర కార్యదర్శి పదవికి, ఎస్‌టీయు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎస్‌టీయు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి సిలివేరి లక్ష్మీ నరసయ్య (Siliveri Lakshmi Narasaiah) ఈ రోజు తెలిపారు. ఎస్‌టీయు నిర్మల్ జిల్లా అధ్యక్షుడు భూమన్న యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జే. లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ ఎస్‌టీయు సంఘాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నంలో భాగంగా జిల్లా రాష్ట్ర మండల నాయకులను ఎవరిని సంప్రదించకుండా గత నెలలో జరిగిన ఎస్‌టీయు జిల్లా ఎన్నికలను ఉదాహరణంగా తీసుకున్నానన్నారు. జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు చేసినా ఎవరిని సంప్రదించకుండా సభ్యులందరినీ అణచి వేసే ధోరణి ప్రయత్నం చేస్తూ ఎస్‌టీయు సంఘాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా వాళ్ల ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అందువల్ల తాము ఎస్‌టీయు సంఘానికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సిలివేరి లక్ష్మి నరసయ్య పేర్కొన్నారు.

Leave a Reply