Murder | శ్రీకాళహస్తిలో మహిళ దారుణ హత్య

Murder | శ్రీకాళహస్తిలో మహిళ దారుణ హత్య

  • వైసీపీ నాయకుడు తల్లిని ఘోరంగా హత్య చేసిన దుండగులు
  • తండ్రి తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
  • ఆధారాలు దొరక్కుండా దుండగులు కారం చల్లిన వైనం

Murder | శ్రీకాళహస్తి, ఆంధ్రప్రభ : శ్రీకాళహస్తి వైసీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిని అతి ఘోరంగా కిరాతకంగా హత్య చేయగా తండ్రి తీవ్రగాయాలతో శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రికలో ఓ ఇంటిలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డానికి అర్ధరాత్రి భవనం వెనుక భాగాల వంటగదికి ఉన్న ఇనుప గ్రిల్ ను కట్ చేసి దుండగులు లోనికి ప్రవేశించారు. నిద్ర మత్తు నుంచి మేల్కొని అడ్డు పడిన వృద్ధ దంపతులపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు.

ఇనుప రాడ్లు కత్తులతో చేసిన దాడిలో రెడ్డివారి జయమ్మ(80) అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త మహదేవరెడ్డి(87) తీవ్ర గాయాల పాలయ్యారు . ఆయనను శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.దంపతులపై పాశవికంగా దాడి చేసి నగదు నగలు చోరీ చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. క్లూస్ టీములను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. వృధ దంపతుల కుమారుడు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో ఓ ప్రైవేటు విద్యాసంస్థను నిర్వహిస్తున్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన భవనంలో వృద్ధ దంపతులు మాత్రమే ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో శ్రీకాళహస్తి పట్టణం ఉలిక్కిపడింది.

మర్డర్ జరిగిన ప్రదేశంలో కారం చల్లిన దుండగులు..

వృద్ధ మహిళను పాసవికంగా దాడి చేసి హత్య చేసి భర్తను తీవ్రంగా గాయపరిచిన ప్రదేశంలో ఎటువంటి ఆధారాలు దొరకకుండా దుండగులు కారంపూడి చల్లారని సమాచారం. దొరక్కుండా చాకచక్యంగా వ్యవహరించి క్లూస్ టీం కూడా ఆధారాలు దొరక్కుండా ప్రణాళిక బద్ధంగా హత్య చేసి ఉంటారని సమాచారం. దుండగులు పారిపోయే సమయంలో గోడకు ఉన్న రక్తపు చేతి వేలి ముద్రలు ఉండడంతో పోలీసులు ఆ దిశగా విచారణ వేగవంతం చేశారు. అయితే ఈ హత్య దాడులు కుటుంబం వర్గంలో ఉన్న విభేదాల వలన జరిగిందా లేదా దొంగతనానికి వచ్చి అడ్డుకున్నందుకు హత్య జరిగిందా అనేది పలు అనుమానాలకు దారితీస్తుంది. ఏది ఏమైనా పోలీసులు దర్యాప్తులో వాస్తవాలు తెలుస్తాయి.

Leave a Reply