Narayanpet | రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు

Narayanpet | రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
మున్సిపల్ కమిషనర్ నర్సయ్య
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
Narayanpet | నారాయణపేట, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు (market yard) లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య (Golkonda Narsaiah) ఈరోజు సందర్శించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధాన్యం కొనుగోలు జరుగుతున్నదా లేదా అని కమిషనర్ ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులు (Farmers) కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. కొనుగోలుకు సంబంధించిన బరువు, తూకాల రికార్డులు, పేమెంట్ నమోదు పుస్తకాలు, స్టాక్ వివరాలు, రైస్ మిల్లులతో సమన్వయం పత్రాల వంటి పుస్తకాలను కూడా కమిషనర్ (Commissioner) పరిశీలించి, సిబ్బందికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. రైతులు ఎదుర్కొనే సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మెప్మా డీఎంసీ శివకుమార్, వివిధ సంఘాల సభ్యులు, మార్కెట్ యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.
