Constitution Day|గుడివాడ, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో గుడివాడ వైసీపీ కార్యాలయంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదేనని విద్యార్థులకు భారత రాజ్యాంగం పై అవగాహన కల్పించాలని తెలిపారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు యువత ముందుకు సాగాలని రాజ్యాంగాన్ని గౌరవించి.. రాజ్యాంగ విలువల పై ప్రజలను చైతన్య పరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్సీ విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి మెండా కిరణ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, చుండూరి శేఖర్, రేమల్లి నీలకంత్, తోట రాజేష్, కాకొల్లు ప్రసాద్, రావూరి చిన్న, బెజ్జం సువర్ణ రాజు, చింతా నాని, మెండా గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
Constitution Day| ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

