BC Reservation | రిజర్వేషన్లు సవరించాలంటూ రాస్తారోకో

BC Reservation | రిజర్వేషన్లు సవరించాలంటూ రాస్తారోకో

BC Reservation | జన్నారం, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు సవరించి బీసీలకు 50శాతం కేటాయించాలని బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఆధ్వర్యంలో నేతలు సోమవారం సాయంత్రం రాస్తారోకో చేశారు.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో 29 గ్రామపంచాయతీలు ఉండగా, బీసీలకు రిజర్వేషన్లు 50శాతం మించకుండా ఏర్పాటు చేయాలన్నప్పుడు 20శాతం రిజర్వేషన్లు బీసీలకు ఉపయోగపడే విధంగా 7 గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వేషన్ కేటాయించవలసి ఉండగా, కేవలం 2 గ్రామ పంచాయతీలను బీసీలకు కేటాయించారని మండలం బీసీ సంఘం నేతలు మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు.

ముందుగా ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో హుమర్ షరీఫ్ వినతిపత్రం అందజేసి, బీసీ రిజర్వేషన్లు సవరించి 7జీపీలను బీసీలకు కేటాయించాలని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం రాష్ట్ర నాయకులు కాసెట్టి లక్ష్మణ్,ఉమ్మడి జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య,జిల్లా కన్వీనర్లు నర్సయ్య, లక్ష్మీనారాయణ, కొంతం శంకరయ్య, జిల్లా కో కన్వీనర్ బి.శ్రీనివాస్ గౌడ్, ఎస్. జనార్ధన్ ,ఆర్.శంకర్, నర్సగౌడ్, పురుషోత్తం, సంద గోపాల్, సుతారి వినయ్, అప్పాలజలపతి, మల్లయ్య,దాసరి రాజన్న, సత్యనారాయణ, బొంతల లక్ష్మణ్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply