Bollywood | ధర్మేంద్ర ఇక లేరు!

Bollywood | ధర్మేంద్ర ఇక లేరు!

శోక సంద్రంలో భార‌తీయ సినీ ఇండ‌స్త్రీ
షోలే గుర్తింపు తెచ్చిన సినిమా
బాలీవుడ్ క‌థ‌నాయిక హేమ‌మాలిని వివాహ‌మాడిన ధ‌ర్మంద్రే
వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూత‌


Bollywood | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : గ‌త కొంత కాలంగా వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధ‌పుతున్న బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (Actor Dharmendra) (89) కన్నుమూశారు. కొన్ని రోజుల కింద ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. డిశ్చార్జి అయిన త‌ర్వాత ముంబ‌యి విల్లా పార్లే లోని స్వ‌గృహంలో ఆయ‌న ప్రాణాలు వీడిచారు. ధ‌ర్మేంద్ర ఇక లేర‌ని తెలిసిన వెంట‌నే బంధువులు, సినీ ప్ర‌ముఖులు ముంబ‌యిలో ఉన్న ఆయ‌న నివాసం వ‌ద్ద‌కు చేరుకుంటున్నారు. ధ‌ర్మేంద్ర మృతితో బాలీవుడ్‌ (Bollywood)తో పాటు భార‌త సినీ ప‌రిశ్ర‌మ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయ‌న నివాసం వ‌ద్ద‌కు అధిక సంఖ్య అభిమానులు, సినీ ప్ర‌ముఖులు త‌ర‌లిరావ‌డంతో ముంబ‌యి పోలీసులు అప్ర‌మ‌త్త‌మై ఆయ‌న నివాసం వ‌ద్ద భ‌ద్ర‌తా క‌ట్టుదిట్టం చేశారు. ధర్మేంద్ర భార్య హేమామాలిని, కుమార్తె ఇషా డియోల్‌ చేరుకున్నారు. ఇక ధర్మేంద్ర మృతికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.


1935 డిసెంబ‌ర్ 8న ధర్మేంద్ర (Actor Dharmendra) పంజాబ్‌ లోని నస్రాలిలో జన్మించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు. తొలి భార్య ప్రకాశ్ కౌర్, రెండో భార్య హేమా మాలిని. 1980లో డ్రీమ్ గర్ల్ హేమమాలినిని వివాహం చేసుకున్నారు. ధర్మేంద్ర వారసత్వాన్ని సన్నీ డియోల్, బాబీ డియోల్ ముందుకు వెళుతున్నారు.


ఇండియన్ సినిమా ఎవర్ గ్రీన్ హిట్ షోలేలో అమితాబ్‌ (amitabh bachchan) తో కలిసి ధ‌ర్మేంద్ర న‌టించారు. అందులో వీరూ పాత్రకు ప్రేక్షకుల నీరాజనం పట్టారు.షోలే సినిమా ఆయనకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆరు దశాబ్దాలకు పైగా తన నటనతో మైమ్పరించారు. 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరా చిత్రంతో అరంగేట్రం చేశారు. కెరీర్ తొలినాళ్లలో సాఫ్ట్, రొమాంటిక్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 1970వ దశకంలో హీ మ్యాన్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ‘అన్పడ్ ‘, ‘బందినీ’, ‘అనుపమ’, ‘ఆయా సావన్ జూమ్ కే’ తదితర చిత్రాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘షోలే’, ‘ధర్మవీర్’, ‘చుష్కే చుప్కే’, మేరా గావ్ మేరా దేశ్, ‘డ్రీమ్ గర్ల్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేశాయి. చివరిగా షాహిద్ కపూర్, కృతి సనన్ల ‘తేరీ బాతోమే ఐసా ఉల్టా జియా’ చిత్రంలో వెండితెరపై కనిపించారు.
యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతమైన పట్టు, ఫిజిక్‌తో మెప్పించారు.

  • 1935 డిసెంబ‌ర్ 8న పంజాబ్‌ లోని నస్రాలిలో జ‌న‌నం
  • 1960లో ‘దిల్ బీ తేరా హమ్ బీ తేరే’తో నటుడిగా కెరీర్ ప్రారంభం
  • ధర్మేంద్ర కెరీర్లో దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించారు
  • చివరి చిత్రం ‘ఇక్కీస్’ త్వరలో విడుదల కానుంది
  • 1997లో ప్రతిష్ఠాత్మక ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.
  • 2012లో భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ పురస్కారం ప్ర‌దానం.
  • 2004-09 మధ్యలో బిజేపీ నుంచి ఎంపీగా సేవలందించారు.
  • టెలివిజన్ రంగంలోనూ ధర్మేంద్ర అడుగు.. ఇండియాస్ గాట్ టాలెంట్ షోకు జడ్జిగా వ్యవహరించారు.
  • తాజ్ డివైడెడ్ బై బ్లడ్ అనే సీరియల్‌లో నటించారు.

Leave a Reply