RSS | పరివర్తన కోసం..

RSS |పరివర్తన కోసం..
RSS | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : వ్యక్తి నిర్మాణం ద్వారా సమాజంలో దేశభక్తిని పెంపొందించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చేపట్టిన జన జాగరణ అభియాన్ కార్యక్రమాన్ని నారాయణపేటలో ప్రారంభించారు. సంఘ్ నగర సంఘ చాలక్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి (Dr. Madan Mohan Reddy) ఈ వివరాలను వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల (2025 విజయదశమి – 2026 విజయదశమి)లో భాగంగా ఈ అభియాన్ దేశ వ్యాప్తంగా ప్రారంభమైందని తెలిపారు. నారాయణపేట నగరంలోని మహంకాళి బస్తీలో స్వయంసేవకులతో కలిసి జన జాగరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ప్రతి ఉపబస్తీ, ప్రతి హిందూ కుటుంబాన్ని సందర్శించి సంఘం లక్ష్యం, కార్యకలాపాలను వివరించే కరపత్రం, భారతమాత స్టిక్కర్, ఒక పుస్తకాన్ని ఇంటింటికీ అందజేశారు. సమాజంలో చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యాచరణను కొనసాగిస్తామని సంఘ్ కార్యకర్తలు తెలిపారు. సమాజ పరివర్తన కోసం ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించిన “పంచ పరివర్తన” సామాజిక సమరసత, కుటుంబ ప్రభోధన్, పర్యావరణ పరిరక్షణ (Environmental protection) స్వదేశీ భావన, పౌర విధులు అనే ఐదు అంశాలను ప్రతి భారతీయుడు ఆచరణలో పెట్టాలని ప్రధానంగా ఈ అభియాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవాహ మేడం ప్రభాకర్, నగర కార్యవాహ చంద్రకాంత్, బాలమురళి, కందికొండ రఘు, జుట్టు శ్రీనివాస్, కోన సాయి తదితర స్వయంసేవకులు పాల్గొన్నారు.
