VEHICLE | మరమ్మతులు చేయించండి మహాప్రభో…

నిరుపయోగంగా చెత్తా సేకరణ వాహనాలు

VEHICLE | ఊట్కూర్, ఆంధ్రప్రభ : స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం ఊట్కూర్ మండల కేంద్రానికి చెత్తా సేకరణ వాహనాలు (రిక్షాలు) పంపిణీ చేసింది. అవి అధికారుల నిర్లక్ష్యం కార‌ణంగా మూలన ప‌డ్డాయి. నారాయణపేట జిల్లా ఊట్కూర్ ప్రభుత్వ ఆసుపత్రి పాత భవనం పక్కన ఐదు చెత్త సేకరణ వాహనాలు తుప్పు పట్టి ఎందుకు పనికిరాకుండా నిరుపయోగంగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుంది. ఊట్కూర్ మండల కేంద్రంలో 16 వార్డులు ఉండగా చెత్త‌ సేకరణ వాహనం ఒకటే ఉండటంతో ఇబ్బందిగా తలెత్తింది. నిరుపయోగంగా ఉన్న చెత్త సేకరణ వాహనాలను మరమ్మతు చేయించి ఉపయోగంలోకి తీసుకురావాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

వాహనాలకు పరికరాలు లభించడంలేదు
ఊట్కూర్ మండల కేంద్రంలో ప్రభుత్వం చెత్త సేకరణ చేపట్టేందుకు 2015లో ప్రభుత్వం రిక్షాలు పంపిణీ చేయగా.. అందులో రెండు పనిచేస్తున్నాయి. ఐదు రిక్షాలకు మరమ్మతులు రావడంతో వాటికి పరికరాలు లభించడం లేదని పంచాయతీ కార్యదర్శి శ్రీ‌నివాస‌రావు చెబుతున్నారు. ప‌రిక‌రాలు దొరికితే మరమ్మతు చేయించిన తర్వాత చెత్తా సేకరణ వాహనాలు ఉపయోగంలోకి తీసుకువస్తామని తెలిపారు. గ్రామంలో వాహనం ద్వారా చెత్త సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నామని అన్నారు.

Leave a Reply