- పత్తి రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
- జాయింట్ కలెక్టర్
COTTON | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ శుక్రవారం ఎమ్మిగనూరు పరిధిలోని నాలుగు కాటన్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు, మిల్లు యజమానులతో ప్రత్యక్షంగా మాట్లాడి పత్తి కొనుగోలు పరిస్థితులను వివరంగా ఆద్యంతం పరిశీలించారు. పత్తి కొనుగోలులో కొనసాగుతున్న సమస్యలను వెంటనే అధిగమించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారులు, సీసీఐ (CCI) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే రైతులకు అనవసర ఇబ్బందులు కలగకుండా పారదర్శక విధానంలో కొనుగోళ్లు నిర్వహించాలని సూచించారు.
పత్తి తేమశాతం నిర్ధారణ, ధరల సమస్యలు, కొనుగోలు వేగం వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించిన అధికారుల బృందం, మిల్లుల్లో నమోదైన లోపాలపై పలు సూచనలు చేశారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.

