జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లాల నవీన్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై ఇద్దరూ చర్చించారు.
స్పీకర్ ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను అభినందిస్తూ ప్రజాసేవలో మరింత ప్రతిష్ఠాత్మకంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం, నవీన్ యాదవ్ స్పీకర్‌ను శాలువాతో సత్కరించి పూల బొకే అందజేశారు.
“స్పీకర్ ఆశీర్వాదాలు, సూచనలు నాకు ఎంతో ప్రేరణ కలిగించాయి. జూబ్లీహిల్స్ ప్రజల సమస్యల పరిష్కారానికి, ప్రాంత అభివృద్ధికి నిత్యం కృషి చేస్తాను” అని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తెలిపారు.

