42 percent reservations | త్వ‌ర‌లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్….

42 percent reservations | త్వ‌ర‌లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్….

42 percent reservations | బిక్కనూర్, ఆంధ్రప్రభ : వచ్చే నెల రెండవ వారంలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్(Notification) వస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. ఈ రోజు మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

మొదటగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు(42 percent reservations) అమలు చేయడం జరుగుతుందన్నారు.

పాత పద్ధతిలోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గ్రామాలలో పెండింగుల్లో ఉన్న పనులను అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పనులు నిలిచి పోవాల్సి వస్తుందని తెలిపారు. ఇట్టి విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయవద్దన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు(Congress party candidates) అత్యధిక స్థానాలలో విజయం సాధిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షట్కర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఉన్నారు.

Leave a Reply