Rs 29 lakh | రైతును రాజుగా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం….
Rs 29 lakh | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : రైతును రాజుగా చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. ఈ రోజు బిక్కనూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద 29 లక్షల రూపాయల వ్యయం(cost of Rs 29 lakh)తో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్(Shopping complex) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసినా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయం మార్కెట్ కమిటీలతో పాటు సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. రైతులు పండించిన ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి సకాలంలో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వం(Government) అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న ఉద్దేశంతో మహిళలకు పలు పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి మహిళా డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా ఉండాలన్నారు.
మహిళలకు ఇబ్బందులు లేకుండా డ్వాక్రా మహిళల(Dwakra Women’s) ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రతి మహిళకు బొట్టు పెట్టి చీరను సారేగా అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పాలన ప్రణాళిక పద్ధతితో కొనసాగుతుందని చెప్పారు.
కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షట్కర్, రాష్ట్ర ప్రభుత్వ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, సలహాదారులు షబ్బీర్ అలీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అడిషనల్ కలెక్టర్ విక్టర్, డిఆర్డిఏ పిడి సురేందర్, వివిధ శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు.

