Jogini | ఝాన్సీలక్ష్మీబాయి ఆదర్శాలను స్ఫూర్తిగా…

Jogini | ఝాన్సీలక్ష్మీబాయి ఆదర్శాలను స్ఫూర్తిగా…
Jogini | ఊట్కూర్, ఆంధ్రప్రభ : మహిళలు, బాలికలు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి( brave woman Jhansi Lakshmibai) స్ఫూర్తితో ముందుకు సాగాలని ఉమ్మడి పాలమూరు జిల్లా జోగిని(Jogini) వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ హాజమ్మ, ముఖ్యవక్తులు హరిలత, రాజశ్రీ, లలితమ్మ పిలుపునిచ్చారు.
ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఆర్ఎస్ఎస్ శతజయంతి వేడుకల్లో భాగంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు సమాజంలో చైతన్యవంతం కావాలని అన్నిరంగాల్లో మహిళలకు భాగస్వామ్యం ఉండాలని, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(Swayamsevak Sangh) సమాజ ఉన్నతి కోసం పంచ పరివర్తన్ పేరుతో పర్యావరణ పరిరక్షణ, కుటుంబ ప్రబోధన్, సామజిక సమరసత, పౌర నియమాలు, స్వదేశీ అనే అంశాలు సమాజంలో విస్తృతంగా తీసుకెళ్లాని సూచించారు.
హిందూ అమ్మాయిలపై లవ్ జిహద్(Love Jihad) పేరుతో జరుగుతున్నప్రమాదలను జాగ్రత్తగా ఎదుర్కోవాలన్నారు. సంఘ వ్యతిరేక శక్తులు అనేక పేర్లతో హిందూ కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనీ కుట్ర చేస్తున్నారని వాటిని తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను రక్షించుకోవాలని, మాతృ భాషను కాపాడుకుంటూ విలువలు కలిగిన శిశుమందిర్ లాంటి పాఠశాలల్లో చదివించడంతో సమాజంలో సంస్కారంతో కూడిన చదువు అలవడుతుందని మహిళల్లో అబద్రత భావన దూరం చేసుకోవాలని అన్నారు.
ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణలో విద్యార్థులు పలు ప్రదర్శనలు, ఝాన్సీ ఏక పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలోపాఠశాల అధ్యక్షుడు భాస్కర్, జగన్నాథ్ రావ్, రాములు, ఏ, నారాయణ, శంకర్ గౌడ్, తమ్మిరెడ్డి, రఘువీర్, భీంరాజ్, ప్రధానాచార్యులు విశాల్, రోషినప్ప, దేవిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
