LIBRARY| నిత్యజీవితంలో పుస్తక పఠనం ఎంతో ప్రాముఖ్యత

  • ఘనంగా 58 వ గ్రంథాలయం ముగింపు వేడుకలు

LIBRARY| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఎందరో మహానుభావుల త్యాగాలు ఈ గ్రంథాలయాలుగా వెలిశాయని, నిత్యజీవితంలో పుస్తకపఠనం ప్రాముఖ్యత నేటి యువతకు ఎంతో ఉపయోగపడుతుందని వక్తలు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పింగళి సూరన స్మారక శాఖ గ్రంథాలయం నంద్యాల వేదికగా 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, కృష్ణదేవరాయలు ఆస్థాన కవి అష్టదిగ్గజ కవులలో ఒకరైన పింగళి సూరన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కోలాట ప్రదర్శన, పద్యాలు, పాటలు, ప్రసంగాలు చేశారు. కవులు, సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు కొప్పుల ప్రసాద్, నీలకంఠమాచారి, ఎండీరఫీ, గ్రంథాలయ నిర్వాకుడు శ్రీధర్, శారదా పీఠం విద్యాసంస్థ కమిటీ సభ్యురాలు సుందరాదేవిలు గ్రంథాలయాల పైన పలు కవితలు, ప్రసంగాలు చేశారు. గ్రంథాలయాల పట్ల తనకు ఉన్న మక్కువను విద్యార్థులతో పాలుపంచుకున్నారు.

నిత్యజీవితంలో పుస్తక పఠనం ప్రాముఖ్యత గురించి తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలు ఈ గ్రంథాలయాలని, గ్రంథాలయాలు విజ్ఞానం భాండాగారాలని, గ్రంథాలయాలను మనుగడకు అవసరమగు గ్రంథాలయ సెస్సు నిధులను త్వరలోనే చెల్లిస్తామని కమిషనర్ అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో చురుకుగా పాల్గొన్న, వివిధ పోటీల యందు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. తదుపరి కార్యక్రమంలో కవులకు, అతిథులకు సన్మానాలు చేశారు. ఈనేపథ్యంలో వసుంధర కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరి చేత గ్రంథాలయ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివలక్ష్మి, సునీత విజయభాస్కర్ రెడ్డి, గ్రంథాలయ పాఠకులు ప్రదీప్ కుమార్, తులసీనాథ్, సాగర్, ప్రియాంక, శైలజ, చాంద్ భాషా, శ్రీనివాసులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply