VARANASI | ‘ప్రళయం ప్రళయం’ ఆడియో విడుద‌ల‌

VARANASI | ‘ప్రళయం ప్రళయం’ ఆడియో విడుద‌ల‌

VARANASI | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ప్ర‌ముఖ టాలివుడ్ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ప్రిన్సి మహేశ్ బాబు హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం వారణాసి. రామోజీఫిల్మ్ సిటీలో ఈ నెల‌ 15న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే.


భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’. ఈ యాక్షన్ అడ్వెంచర్లో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కుంభ అనే పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో ఈ పాత్రను పరిచయం చేస్తూ ఓ పాట రూపంలో ప్రజెంట్ చేశారు. ఇప్పుడు ఇదే పాట ఆడియోను విడుదల చేశారు. ‘ప్రళయం ప్రళయం’ అంటూ సాగే ఈ ‘రణ కుంభ’ పాటను విడుద‌ల చేశారు.

ఇటీవల జరిగిన గ్లోబ్స్ ట్రాటర్ ఈవెంట్ మిస్సయ్యారా? నో పాబ్లెమ్‌.. యూట్యూబ్ వేదికగా ఈ మొత్తం ఈవెంట్ను చిత్రబృందం విడుదల చేసింది. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’ (Varanasi). నవంబర్ 15న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. జియోహాట్ స్టార్ వేదికగా లైవ్లో దీన్ని చూసే అవకాశం కల్పించింది. ఇప్పుడు ఇదే ఈవెంట్ను (Globetrotter Event) యూట్యూబ్లోకి వచ్చేసింది.

Leave a Reply