MURDER | బైక్ పై వెళ్తుండగా కత్తులతో దాడి..

  • ఆసుపత్రిలో మిట్టపల్లూరు రామ్మూర్తి మృతి

MURDER | పుత్తూరు, ఆంధ్రప్రభ : పుత్తూరు పట్టణం గొల్లపల్లి సమీపంలో బుధవారం మిట్ట మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న మిట్టపల్లి రామ్మూర్తిపై కొంద‌రు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయ‌ప‌డిన‌ రామ్మూర్తిని పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్క‌డ చికిత్స పొందుతూ ఆయ‌న మృతిచెందిన‌ట్లు తెలిసింది. ఒకరిని అదుపులో తీసుకోగా, మిగ‌తావారు ప‌రారైన‌ట్లు సమాచారం. దాడి గ‌ల కారణాలు తెలియ‌రాలేదు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply