Medical Camp | 104 మంది రోగుల‌కు చికిత్స‌లు…

Medical Camp | 104 మంది రోగుల‌కు చికిత్స‌లు…

Warangal | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : మేడపల్లిలో ఈ రోజు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ విజయకుమారి(Dr. Vijayakumari), శారద, ప్రవీణ్‌కుమార్‌లు పాల్గొని 104 మంది రోగులను(104 patients) పరీక్షించి వారికి అవసరమైన మందులు, తైలాలు పంపిణీ చేశారు.

చలికాలంలో సాధారణంగా కలిగే మోకాళ్ల‌ నొప్పులు, కీళ్ల నొప్పులు(joint pain), నడుము నొప్పి, భుజనొప్పి వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయకుమారి మాట్లాడుతూ.. ప్రస్తుతం చలికాలం కావడంతో కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రకాల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఆయుర్వేద చికిత్సలు ఎంతో ఉపయోగపడతాయ‌ని ప్రజలు ప్రకృతి సిద్ధమైన పద్ధతుల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె సూచించారు.

Leave a Reply