HYD | డాక్టర్‌ గారూ.. మీరెక్కడ..

HYD | డాక్టర్‌ గారూ.. మీరెక్కడ..

  • వైద్యుడి కోసం బీఎన్‌రెడ్డి బస్తీవాసుల ఎదురుచూపులు
  • దవాఖానాకు డాక్టర్‌ రాక రోగుల ఇబ్బందులు
  • కిందిస్థాయి సిబ్బందే వైద్య సేవలు అందిస్తున్న వైనం

ఎల్బీనగర్‌, ఆంధ్రప్రభ : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గత ప్రభుత్వం ప్రజల చెంతకే వైద్యం పేరుతో బస్తీ దవఖానాలను ఏర్పాటు చేసింది. మొదట్లో సత్ఫలితాలు కనిపించాయి. కానీ ప్రస్తుతం బస్తీ దవాఖానాలను పట్టించుకునే వారు లేక పరిస్థితి రోజురోజుకు అవి నిర్వీర్యంగా తయారవుతున్నాయి.

సౌకర్యాలు, సిబ్బంది కొరతతో రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. బి.ఎన్ రెడ్డి నగర్‌ డివిజన్‌ పరిధిలోని బస్తీ దవాఖానకు గత కొన్ని రోజులుగా డాక్టర్‌ రాక ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డ్యూటీ నర్స్‌, సహాయ సిబ్బంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు.

ఆసుపత్రికి రోజుకు సుమారు 50 నుంచి 60 మంది ప్రజలు అనారోగ్యం పాలై వస్తుండడంతో చిన్న గదులలో ఏర్పాటు చేసిన దవాఖానాలో వేచి ఉండేందుకు వెయిటింగ్‌ హాల్‌ లేక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. కూర్చోనీకి కుర్చీలు లేకపోవడంతో రోడ్డుపైనే రోడ్డుపైనే నిలబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత అధికారులు, ప్రజాప్రతిని ధులు బస్తీ దవాఖానను పెద్ద భవనం లో ఏర్పాటు చేసే విధంగా తక్షణ చర్య లు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గత నెల రోజులుగా బస్తి దావాఖానకు డాక్టర్‌ రావడం లేదు. దీంతో ఆస్పత్రికి వచ్చే స్థానికులం వైద్య సేవల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.

విషయాన్ని వైద్య అధికారు ల దృష్టి కి తీసుకువెళ్లిన ఫలితం లేదు. స్థానిక కార్పొరేటర్‌ బస్తీ దవాఖానను సందర్శించి.. డాక్టర్ను నియమించాలని సూచనలు చేసిన మార్పు శూన్యం గతంలో మాదిరిగా ఇప్పుడు టెస్టులు కూడా చేయడం లేదు. మందులు కూడా సరిపడా లభించడం లేదు. ఉన్నతా ధికారులు చొరవ తీసుకొని వెంటనే. ప్రధాన డాక్టర్‌ను అపాయింట్టెంట్‌ చేయాలన్నారు. అనారోగ్యంతో ఆసుప త్రికి వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా కనీస వసతులు కల్పించాలన్నారు.

Leave a Reply