ICC Champions Trophy | శుభమన్ గిల్ హాఫ్ సెంచరీ..
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత్ – బంగ్లా జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు… 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది.
ఈ క్రమంలో 229 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దంచికొడుతొంది. యువ బ్యాట్స్మెన్ శుభమన్ గిల్ బెంగ్లా బౌలర్లను బాదేస్తూ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
69 బంతుల్లో 1 సిక్స్, 5 ఫోర్లతో 50 పరుగులు చేసిన గిల్… నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును కదిలిస్తున్నాడు. కాగా, ప్రస్తుతం క్రీజులో శుభమన్ గిల్ (50) – శ్రేయస్ అయ్యార్ (7) ఉన్నారు. టీమిండియా స్కోర్ 123/2