AP | పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు ప్రక్రియ చేపట్టాలి

AP | పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు ప్రక్రియ చేపట్టాలి

  • జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

AP | కర్నూలు, ఆంధ్ర‌ప్రభ : పత్తి కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. సమర్థవంతంగా వ్య‌వ‌స్థ‌ను నడిపించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి ఆదేశించారు.

సోమవారం, గూడూరు మండలం పెంచికలపాడు గ్రామంలోని మంజిత్ కాటన్ జిన్నింగ్ & ప్రెస్సింగ్ యూనిట్‌లో సిసిఐ నిర్వహిస్తున్న పత్తి సేకరణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం నుండి అందిన ఆదేశాల ప్రకారం ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని పత్తి సీసీఐ అధికారులకు స్పష్టం చేశారు. రైతులకు కొనుగోలు ప్రక్రియలో జాప్యం చేయకుండా కొనుగోలు చేయాలని సూచించారు.

కిసాన్ కపాస్ యాప్ ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్‌కు సంబంధించి సమయం మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పత్తిలో తేమ శాతం 13 నుండి 14 శాతం తేమ ఉన్నా కూడా.. పత్తిని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీసీఐ ప్రతినిధులకు సూచించారు.

రైతులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఏడి నారాయణమూర్తి, సీసీఐ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply