Dongli | విద్యార్థులకు చట్టాలపై అవగాహన

Dongli | విద్యార్థులకు చట్టాలపై అవగాహన
Dongli | డోంగ్లి, ఆంధ్రప్రభ : విద్యార్థులకు (Students) చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ రోజు కామారెడ్డి జిల్లా డోంగ్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సందర్శించి పోక్సో చట్టం – 2012, బాల్య వివాహాల నిరోధక చట్టం – 2006 వంటి అనేక అంశాలపై విద్యార్థులకు అవగాహన (Awareness) కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, సీనియర్ ఉపాధ్యాయులు సునీల్, ఉపాధ్యాయ బృందం, సీఆర్‌పీ, పంచాయతీ కార్యదర్శి సవాయి సింగ్, అంగన్వాడీ కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
