TEMPLE | సోమేశ్వరునికి డిప్యూటీ స్పీకర్ పూజలు

TEMPLE | భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: కార్తీక మాసంలో చివరి సోమవారం సందర్భంగా పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరంలోని సోమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణ రాజు నిర్వహిం చారు. అంతకుముందు ఆలయ మర్యాదలతో ఆయనకు దేవస్థానపాలకవర్గ చైర్మన్ బంగారు రాజు, ఆలయ ప్రధాన అర్చకులు చేకూరి రామకృష్ణ పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం పూజలు నిర్వహించి, ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో పాలకోడేరు సహకార సంఘం చైర్మన్ కొత్తపల్లి నాగరాజు, వ్యాపారవేత కారుమూరి గుప్తా, మావుళ్ళమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
