Vangaveeti Daughter political Entry | ఎవరికి.. ఈ ఆశా కిరణం..

Vangaveeti Daughter political Entry | ఎవరికి.. ఈ ఆశా కిరణం..

    • వంగవీటి తనయ  పొలిటికల్​ ఎంట్రీపై స్పెషల్​ స్టోరీ
    • అమ్మా వద్దన్నా.. రాజకీయారంగేట్రం.
    • ఈ వ్యూహం ఎవరిది?
    • టీడీపీ ? వైసీపీ ? పాతకాపులా?
    • లక్ష్యం ఎవరు? జనసేనా? పసుపు సేనా?
    • ఆశాకిరణ్​  పొలిటికల్​ ఎంట్రీపై స్పెషల్​ స్టోరీ
    Vangaveeti

    ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్​ నెట్​ వర్క్​ ప్రతినిధి : ఏపీ రాజకీయాల్లో కొత్త వాయిస్​ తెరమీదకు వస్తోంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,, కాపు నేత దివంగత వంగవీటి మోహన రంగ (Vangaveeti Mohan Ranga Daughter)  తనయ ఆశాకిరణ్ ( Asha Kiran) ​ రాజకీయ ఆరంగేట్రం చేస్తున్నారు. ఆంధ్రావనిలోని పల్లెపల్లెలో కాపు సామాజిక వర్గం ఆరాధ్య దైవంగా భావించిన వంగవీటి మోహన రంగం జనం మదిలో చిరస్మరణీయుడే. ఆయన ఆశయం లక్ష్యంగా .. ఆయన వారసత్వం ప్రజల్లో మూడు దశాబ్ధాల అనుబంధం వీడనిది.

    కానీ రాధారంగా మిత్ర మండలి ( Radha Radha  Mitra Mandali)  లో అంతర్గత పొరపొచ్చాలతో.. కాపు సామాజిక వర్గం విభిన్న మార్గాల్లో పయనిస్తున్న వేళ… దివంగత వంగవీటి మోహన రంగ కుమార్తె .. ఆశాకిరణ్​ .. తాజాగా రాజకీయ ప్రవేశాన్ని (Political Entry)  ప్రకటించారు. ఇప్పటి వరకూ ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం తగిన రీతిలో.. అధికారానికి దగ్గర కాలేదు. కానీ మెగాస్టార్​ చిరంజీవి రాకతో కాపుల్లో ఆశలు పెరిగాయి, అంతలోనే ఆశలు నిరాశలయ్యాయి. ఇక పవర్​ స్టార్​ పవన్​ కళ్యాణ్ ( Power Star) ​.. అకుంటిత దీక్షతో జనసేన పార్టీని .. రాజకీయ నిర్ణేతగా తీర్చిదిద్దారు.

    ఏపీలో కాపు సామాజిక వర్గం ప్రస్తుతం జనసేన వైపు దృష్టి మళ్లించింది. ఇదే తరుణంలో వంగవీటి మోహన రంగా తనయ ఆశాకిరణ్​ రాజకీయ ఆరంగేట్రం .. పొలిటికల్​ సీన్​ లో కొత్త ట్విస్టులు (new twists) ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఆశాకిరణ్​ దారేటు? తండ్రి బాటలో Father way)  నడుస్తుందా? ఆన్న మార్గంలో (brother  road) పయనిస్తుందా? లేక తానే (new way)  కొత్త పుంతను తొక్కుతుందా? ఇవీ,, ప్రస్తుతం ఏపీలో గ్రామ గ్రామాన కాపు వర్గాలను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

    కాపు నేత వంగవీటి మోహన రంగా హత్యోదంతం ( Ranga murder)  తరువాత.. ఆయన సతీమణి ( Ranga Wfe)  వంగవీటి రత్నకుమారి (Ratna Kumari)  విజయవాడ ప్రజలకు రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచారు. కాంగ్రెస్​ పార్టీకి బెజవాడ అధినేత్రిగా ( Congerss leader)  ఎదిగారు. ఆ సమయంలోనే తన బిడ్డలు రాధా, ఆశ ను ఎట్టిపరిస్థితిలోనూ రాజకీయాల్లోకి రానివ్వనూ అని శపథం చేశారు. వంగవీటి రాధా రాజకీయ ప్రయాణాన్ని అడ్డుకున్నారు.

    ఎన్నికల్లో వ్యతిరేకంగా ప్రచారం చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన రత్నకుమారి క్రమేపీ కాపు వర్గాలకు దూరమయ్యారు. ఇక వంగవీటి రాధా కృష్ణ (Ranga son Radha Krisna)   పరిసితి పరిశీలిద్దాం. వంగవీటి రంగా తనయుడిగా.. కాపు వర్గం ఆశాజ్యోతిగా..  2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున  విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజక వర్గం (Vijayawada East)  నుంచి  ఎమ్మెల్యేగా గెలిచాడు. 2008 లో ప్రజారాజ్యం పార్టీలో (PrajaRajyam)  చేరారు.  

    2009 ఎన్నికల్లో  ఓడిపోయాడు. 2014లో వైసీపీ (Joined in YCP) లో చేరారు. కానీ  ఎన్నికల్లో (Defeated) ఓడిపోయాడు. 2019లో తెలుగుదేశం (Joined in TDP)  తీర్థం పుచ్చుకున్నారు. గత ఆరేళ్లుగా రాజకీయ మనుగడలో రాధాకు అడ్డంకులు తప్పటం లేదు. కనీసం ఎమ్మెల్సీ (No MLC) దక్కలేదు.

    పార్టీలో రాష్ట్ర స్థాయి పదవి లభించినా.. కనీసం ఒక్క కార్పోరేషన్​ చైర్మన్​ గిరి ( No Corportoin chairman Ship)  లభించలేదు. జనసేన దూకుడు పెరుగుతోంది. వందశాతం స్థానాల్లో విజయం సాధించటమే కాదు, అధికారంలోనూ కీలక బాధ్యతలు అందుకున్నారు. ఇక రాబోయే పదేళ్లల్లో జనసేన మరింత అగ్రస్థానంలో నిలబడటం ఖాయం. ఇదీ రాజకీయ విశ్లేషకుల అంచనా.

    దివంగత వంగవీటి మోహన రంగా కుమార్తె ఆశ కిరణ్​… తన తల్లి మాటప్రకారమే రాజకీయాలకు దూరంగా ( Asha not interested poliyics)  ఉన్నారు. పెళ్లి చేసుకుని కాపురం చేసుకొంటున్నారు. గతంలో రాజకీయాల్లోకి రావద్దంటూ అప్పటి ఎమ్మెల్యే రాధాను ఓడించటానికి వీధివీధిలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

    కానీ.. అకస్మాత్తుగా తన తండ్రి విగ్రహానికి పూలమాల వేసి.. నివాళి అర్పించి.. త్వరలో రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నట్టు today declared political entry)  ప్రకటించగానే కావు వర్గాలు నివ్వెర పోలేదు. అయితే ఓకే. ఇంతకీ ఆశా ఎవరి పక్షం? ఏ రాజకీయ పార్టీ పక్షం? లేక కొత్త పార్టీని తెరమీదకు తీసుకువస్తుందా? అందుకు అవసరమైన బలం, బలగం ఉందా? ఆర్థిక బలం ఎవరు సమకూర్చుతారు? ( Who supported)  జనసేన పార్టీని కాపాడుకోవటానికి జనసేనాని పదేళ్లు కష్టపడ్డారు. ఆర్థిక ఈతి బాధలను తట్టుకున్నారు. అన్నిటి కంటే.. వ్యతిరేక రాజకీయ వర్గం ఈసడింపులు, చీత్కారాలను భరించారు. తట్టుకున్నారు. కడకు తన సత్తా చాటారు.

    ఇక మహా నేత వంగవీటి రంగా తనయ ఈ రాజకీయ పోకడలను ఎలా (How Manage) తట్టుకుంటుంది. అసలు ఆమె పొలిటికల్​ ఎంట్రీకి కారణాలేంటీ? ఏపీలో ఏకమవుతున్న కాపు వర్గాలను (Divide Kapus?)  చీల్చటమే లక్ష్యమా? జనసేనను (Focus on janasena)  బలహీన పర్చటమే లక్ష్యమా? ఈ వ్యూహం (Whose Plan) ఎవరిదీ? తెలుగుదేశం (TDP) పార్టీదా? వైసీపీ (YCP)  కొత్త సరికొత్త (New Plan) తంత్రమా? కొత్తగా మూడో శక్తి ఆవర్భవిస్తోందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి.

    కానీ ఆలశ్యంగా వెలుగు చూస్తాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ.. వంగవీటి  రాధాకృష్ణను  ఒక బంటుగా ప్రయోగించింది. రంగా అభిమానులను ( brake for YCP)  వైసీపీ దరి చేరకుండా బ్రేక్​ వేసింది. ఇక ఉయ్యూరులోని  వంగవీటి వారసులను వైసీపీ తన శిబిరంలోకి చేర్చుకుంది. గత ఎన్నికల సమయంలో వంగవీటి చలపతి (Vangaveeti Chalapathi Son) తనయుడు వైసీపీలో చేరారు. కానీ టిక్కెట్లు లభించలేదు. ఇక్కడే వంగవీటి వారసుల్లో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి.

    మోహనరంగాకు అసలు సిసలు వారసుడిని నేనే అని మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ తన రాజకీయ ప్రయాణం చేస్తుంటే.. రంగా మిత్ర మండలి ఆయన అడుగు జాడల్లో నడుస్తోంది. ఇక వంగవీటి మోహన రంగాను కడతేర్చిన తెలుగుదేశం పార్టీలో ఎలా చేరుతాడంటూ రాధాకృష్ణకు వ్యతిరేకంగా.. వంగవీటి చలపతి తనయుడు (Defered Vagveeti Radha Krishna)  ఎదురు తిరిగారు. రాధా మిత్ర మండలి ఆయనకు (Radha Ranga Mitra Mandali supported)  మద్దతుగా నిలిచింది.

    ఈ స్థితిలో వంగవీటి కుటుంబం పునాది వేసిన రాధారంగా మిత్ర మండలి.. మధ్య సయోధ్యకు .. రంగా కుమార్తె ఆశాకిరణ్​ ..తాజాగా రాజకీయ తెరపైకి వచ్చారు. ఇంతకీ ఆశా కిరణ్​ ను.. కాపు సామాజిక వర్గాల్లో ( Is Kapus welcomes )  తమ ఆడపడుచుగా అక్కున చేర్చుకుంటాయా? ఇక వంగవీటి కుటుంబంతో కేవలం ప్రేమ మాత్రమే పంచుకుంటారా? వేచి చూడాల్సిందే.

    రాజకీయాల్లోకి వస్తున్నా..  రాధా రంగా మిత్రా మండలి ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొంటా. రంగా ఆశయ సాధనకు కృషి చేస్తా.  పబ్లిక్ లైఫ్ కి దూరంగా ఉన్నా.  ఇకపై పూర్తి గా జీవితమంతా ( in between people)  ప్రజల మధ్యలోనే గడుపుతాను. ప్రజలకు ఏ కష్టం వచ్చినా  అండగా ఉంటా.

     రాధా రంగా మిత్రా మండలి మధ్య  గ్యాప్ ఉంది. ఆ గ్యాప్  ( Ful pill  gap)   పూడ్చటానికే వస్తున్నా.  కులం,మతం బేధం లేకుండా సాయం చేసిన ఏకైక వ్యక్తి వంగవీటి రంగా .. ఆయన సిద్ధాంతాలను, ఆశయాలను  ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్తా. ఇదీ వంగవీటి ఆశాకిరణ్​ ఆశాభావం.

    Leave a Reply