Jupally | బీఆర్ఎస్‌కు చెంపదెబ్బ..

Jupally | బీఆర్ఎస్‌కు చెంపదెబ్బ..

Jupally | జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారుని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. ఈ ఫలితాలు బీఆర్ఎస్ నాయకులకు చెంపపెట్టులా ఉన్నాయని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండమని చెప్పిన కేటీఆర్.. ఇప్పుడు తన ముఖాన్ని ఎక్కడ పెట్టుకుంటారు?” అంటూ ప్రశ్నించారు. ఇకనైనా అసత్య ఆరోపణలు మానుకోండి, తప్పుడు ఆరోపణలు మాని అభివృద్ధికి సహకరించండి అని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు.

మంత్రి జూపల్లి (Minister Jupally) విజేత నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పోరేషన్ చైర్మన్లు, పార్టీ శ్రేణులకు ప్రత్యేక అభినందనలు పంపారు.ఎర్రగడ్డ డివిజన్లో కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. “వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నా వంతు కృషి చేస్తాను” అని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ (BRS) హయాంలో పదేళ్ల పాటు దుష్ట పాలన సాగిందని, ముఖ్యంగా ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం వెనుకబడిపోయిందని ఆరోపించారు. అయినప్పటికీ, ఆర్థిక అవరోధాలు ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నారని కొనియాడారు.

Leave a Reply