Telangana | ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి..

Telangana | ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి..

రాష్ట్ర హౌసింగ్ మేనేజింగ్​ డైరెక్టర్ వీపీ గౌతమ్..
మైతాభ్ ఖాన్ గూడలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలన..


Telangana | నవాబ్ పేట్, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇండ్ల ((Indiramma Houses) నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హౌసింగ్ మేనేజింగ్​ డైరెక్టర్ వీపీ గౌతమ్ (VP Gautam) సూచించారు. గురువారం నవాబ్ పేట్ మండలంలోని మైతాభ్ ఖాన్ గూడ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో రాష్ట్ర ఇందిరమ్మ ఇండ్ల కార్యదర్శి వీపీ గౌతమ్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో లబ్దిదారులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల నిర్మాణంలో ఇబ్బందులు కలుగుతున్నాయా, ఇసుక సరఫరా, ఇటుకల కొనుగోలు, నిర్మాణ ఖర్చు, బిల్లులు జమ అవుతున్నాయా, అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారా, బిల్లులు నేరుగా ఖాతాలో పడుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Houses) కు వంద శాతం మార్క్​అవుట్​ పూర్తి చేయాలని,నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు.గడువులోగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకునేలా అధికారులు చూడాలన్నారు.లబ్దిదారులు ఇండ్లు నిర్మించుకునే సమయంలో ఇబ్బందులు తలెత్తితే నిర్మాణానికి అవసరమైన నిధులను మహిళ సంఘాల (స్వయం సహాయక సంఘాలు) ద్వారా లోన్ రూపంలో లబ్దిదారులకు అందించాలని, లబ్దిదారులు ఇండ్లు సమయానికి పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుందని వెల్లడించారు.

ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ సుదీర్ (Additional Collector Sudhir), హోసింగ్ పీడీ దశరథ్ సింగ్ రాథోడ్, హొసింగ్ డీఈ, సైయాద్ సాజిద్,ఎంపీడీఓ అనురాధ, హోసింగ్ ఏఈ రమేష్, ఎంపీవో విజయ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శోభరాణి, పీల్డ్ అసిస్టెంట్ సాయిలు, గ్రామస్తులు రంగారెడ్డి, రాజు, మహేందర్, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు ఖాజాపాషా, తదితరులు ఉన్నారు.

Leave a Reply