MLA | దార్శనికత అమలుకు శ్రీకారం

MLA | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్‌కు అనుగుణంగా బాపట్లలో విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయం గురువారం పురపాలక సంఘం కార్యాలయంలో మాజీ ఎంపీ డాక్టర్ డి. రామానాయుడు నిధులతో నిర్మించిన భవనంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ కార్యాలయాన్ని ముఖ్య అతిథిగా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొని ప్రారంభించారు. శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు చేతుల మీదుగా చైర్ పర్సన్ రూంను ప్రారంభించారు.

ఎమ్మెల్యే, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు తో కలసి కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక ప్రభుత్వ కార్యాలయం విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అని ఎమ్మెల్యే తెలిపారు. 9 మంది సభ్యుల బృందంతో యూనిట్ నడుస్తుందన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తారన్నారు. స్పెషల్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్‌గా, ఒక ఎకాడమిక్ అధికారి, ఒక యంగ్ ప్రొఫెషనల్, జీఎస్‌డబ్ల్యూఎస్ నుంచి ఐదుగురు సిబ్బంది పనిచేస్తారని తెలిపారు. యూనిట్ కార్యకలాపాల కోసం రూ.10 లక్షలు ప్రభుత్వం కేటాయించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.

పేదరికం లేని సమాజం, ఉద్యోగ కల్పన, నైపుణ్యం-మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్‌, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు-బ్రాండిరగ్‌, స్వచ్ఛాంధ్ర, డీప్‌ టెక్‌..ఇలా 10 ప్రధాన సూత్రాలతో కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామ‌ని తెలిపారు. తెదేపా పట్టణ అధ్యక్షుడు గోలపల శ్రీనివాసరావు, జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ, నాటకరంగ అకాడమీ డైరెక్టర్ అంద్రయ్య, పురపాలక కమిషనర్ జి రఘునాథరెడ్డి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply