heart attack | కేంద్ర కార్యాలయంలో నంద్యాల జీవిత ఖైదీ మృతి

heart attack | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలం భీమునిపాడుకు చెందిన చిన్నసుంకి రెడ్డి గురువారం ఉదయం గుండెపోటుతో మరణించాడని పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదుగా శిక్ష అనుభవిస్తున్న సుంకిరెడ్డికి గురువారం ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో అతన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి వెంటనే తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని జైలు అధికారుల ద్వారా కోయిలకుంట్ల పోలీసులు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply