- సజావుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
- రైతు సేవా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్ బాలాజీ
Collector | గూడూరు, ఆంధ్రప్రభ : గూడూరు మండలలో రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ డీకే.బాలాజీ గురువారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా రైతు సేవా కేంద్రంలో ఉన్న గోనెసంచులను ఆయన పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని కేంద్రం సిబ్బందికి సూచించారు. తేమ శాతం విషయంలో టెక్నికల్ అసిస్టెంట్లు ప్రభుత్వ సూచనలు పాటించాలని తెలిపారు. మొంథా తుఫాను నేపథ్యంలో రైతులు యంత్రాల సహాయంతో వరి కోతలు కోస్తున్నారని, వారు పంపించిన ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్లులకు పంపేలాగా సిబ్బంది చొరవ చూపాలని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆయా మండలాల తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులతో సంప్రదించాలన్నారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం సేకరించడం జరిగింది..? తేమశాతం పరీక్షించే యంత్రాలను ఆయన పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

