ప‌రిశుభ్ర‌త‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు…

ప‌రిశుభ్ర‌త‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు…

కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ( ఆర్ బి ఎస్ కె )పథకంలో భాగంగా కోనాపూర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్యం పరిశుభ్రతపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఆర్ బి యస్ కే పథకంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోనాపూర్ విద్యార్థులకు మెడికల్ ఆఫీసర్ కంతి(Medical Officer Kanti), రాజేందర్ వైద్య పరీక్షలు నిర్వహించారు.

వివిధ వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులకు మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆరోగ్యం పరిశుభ్రతపై అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ప్ర‌తి రోజు ప‌రిశుభ్రంగా ఉండ‌డం, భోజనం తర్వాత పళ్లు శుభ్రం చేసుకోవడం(cleaning the gums and teeth) చాలా అవసరమని సూచించారు. మంచి ఆరోగ్యానికి చేతుల పరిశుభ్రత చాలా అవసరం అన్నారు.

దుస్తుల పరిశుభ్రత కూడ ముఖ్యం అని, ఉతికిన బట్టలను మాత్రమే ఉపయోగించాలని అన్నారు. మనం నివసించే ప్రదేశం పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు దానంతట అవే దూరంగా ఉంటాయని చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ కె కమ్మర్ పల్లి సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply