Champions Trophy | టాస్ గెలిచిన పాక్… బ్యాటింగ్ కు దిగిన కివీస్ …
కరాచీ – ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభపు మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్, న్యూజి లాండ్ జట్లు తడపడుతున్నాయి.. నేటి మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.. నాలుగు ఓవర్లు ముగిసే నాటికి బ్లాక్ క్యాప్స్ 24 పరుగులు చేశారు…. ఇక ఈ మ్యాచ్ లో . డిఫెండింగ్ ఛాంప్ పాకిస్తాన్ తమ హోమ్ గ్రౌండ్స్‌లో ఆడుతుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. పాక్‌ను వారి సొంత గడ్డపై ఓడించడం ఏ జట్టుకైన పెద్ద సవాలే. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభా గాల్లో పాక్ టీమ్ పటిష్టంగా ఉంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, మాజీ సారథి బాబార్ ఆజమ్, ఫఖర్ జమాన్, సౌద్ షకీల్, ఉస్మాన్ ఖాన్, తయ్యబ్ తాహీర్‌లతో కూడిన బ్యాటింగ్ ఆర్డర్ ఎలాంటి బౌలింగ్ లైనప్‌నైనా ఈజీగా చిత్తు చేయగలదు. అలాగే బౌలింగ్‌లో నసీమ్ షా, షాహిన్ షా అఫ్రిదీ, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్ లతో పాటు ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ ఆఘా లాంటి ప్రమాదరకమైన ఆల్‌రౌండర్లు ఉండటం పాక్‌కు అదనపు బలం.
ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే.. ఈ జట్టు కొద్దికాలంగా పెను సంచలనాలు సృష్టి స్తోంది. తమ సొంత మైదనాల్లోనే కాకుండా విదేశీ పర్యటనలలోనూ చిరస్మరణీయ విజ యాలు సాధిస్తూ ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపె డుతుంది. ఇటీవల పాకిస్తాన్లో జరిగిన త్రై పాక్షిక సిరీస్‌ను కూడా న్యూజిలాండ్ గెలుచుకుంది. ఫైన ల్లో ఆతిథ్య పాకిస్తాన్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడిన కివీస్ పాకిస్తాన్‌ను రెండు సార్లు, దక్షిణాఫ్రికాను ఒక సారి ఓడిం చింది. ఇక ఈ జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదువేలేదు. బ్యాటిం గ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో కివీస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కాగా, ఆ జట్టు స్టార్ పేసర్ ఫెర్గ్యూసన్ గాయంతో చివరి నిమిషంలో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో కైల్ జామిసన్ కివీస్ జట్టులో చేరాడు. మొత్తంగా ఇరుజట్లు ఈ మ్యాచ్‌లో తమ పూర్తి స్థాయి బలబలగాలతో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. రెండు జట్లలో కూడా స్టార్ ఆటగాళ్లు ఉండటంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయం.