స్ప‌ష్ట‌మైన గ‌స్తీతో ప‌ట్టుబ‌డ్డ నిందితులు..

స్ప‌ష్ట‌మైన గ‌స్తీతో ప‌ట్టుబ‌డ్డ నిందితులు..

జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఇటీవల బైకు దొంగతనాలకు పాల్పడిన నలుగురు దొంగలను ఏసీపీ పండరి చేతన్ నితిన్(ACP Pandari Chetan Nithin) ఈ రోజు జనగామ పోలీస్ స్టేషన్లో మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల జరిగిన బైక్ దొంగతనాలపై సీపీ సన్ ప్రీత్ సింగ్(CP Sunpreet Singh) ఉత్తర్వుల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ పాండరీ చేతన్ నితిన్, జనగామ సీఐ పీ సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో ఎస్సై భరత్ సిబ్బందితో మూడవ తేదీ తెల్లవారుజామున స్పష్టమైన గస్తీ చేస్తుండగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారని అన్నారు.

వారిని విచారించగా బైక్ దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. వివరాల ప్రకారం వీరు సూర్యాపేట జిల్లాకు చెందినవారుగా చెవుల మనోజ్(Kulaiya Manoj) తండ్రి వెంకన్న వయసు 24 కార్ డ్రైవర్ కాగా గ్రామం ఆరెగూడెం మండలం సూర్యపేట, గొర్ల శివ రెడ్డి(Gorla Siva Reddy) తండ్రి లక్ష్మారెడ్డి వయసు 21 కులం రెడ్డి గ్రామం కేసారం సూర్యాపేట మండలం, ఆర్య విజయ్(Arya Vijay) తండ్రి సైదులు వయసు 17 కులం ముదిరాజ్ గ్రామం జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి, వీరబోయిన భరత్(Veeraboyana Bharath) తండ్రి లింగయ్య వయసు 22 కులం యాదవ గ్రామం నిమ్మికల్ మండలం ఆత్మకూరు జిల్లాకు చెందినవారుగా గుర్తించారు.

వీరిపై కావడి అనిల్ కుమార్, జలిగం మహేష్ లు ఫిర్యాదు చేయగా పై వారి మీద కేసు నమోదు చేశారు. నిందితులు గతంలో స్నేహితులుగా పరిచయమై మద్యానికి, గంజాయికి అలవాటు పడి జల్సాలకు, దొంగతనాలు చేశారని గతంలో గంజాయి అటెంప్ట్ మర్డర్ కేసులో సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్, ఆత్మకూర్ ఎస్ పోలీస్ స్టేషన్లో కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చారని అన్నారు.

ఇదే క్రమంలో 27వ తేదీ రాత్రి తిరుమలగిరి వద్ద కలుసుకొని మద్యాన్ని సేవిస్తూ మనోజ్ రెడ్డితో నాలుగు నెలల క్రితం టయోటా కారు ఐదు లక్షల 50 వేల వరకు కొనుగోలు చేయడం జరిగిందని, దాన్ని ఈఎంఐ నేలకు 17,500 రూపాయలు కట్టడానికి ఇబ్బంది అవుతుందని సదరు స్నేహితులు చెప్పడంతో అదే రాత్రి టయోటా కార్ నెంబర్ టిఎస్ 09 యు సి 73 29 కారులో జనగామ కు వచ్చి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ టీఎస్ 27 జి 3806, మరొకటి బజాజ్ పల్సర్(Bajaj Pulsar) నెంబర్ టీఎస్ 27 ఏ 0 367 రెండు బైకులు దొంగిలించి సూర్యాపేటకు తీసుకెళ్లి మనోజ్ పిన్ని ఇంటి వద్ద పెట్టారని తెలిపారు.

ఇట్టి విషయంపై పక్కా సమాచారం మేరకు ఎస్సై భరత్ సిబ్బందితో ఈ రోజు తెల్లవారుజామున పటిష్టమైన గస్తీ చేస్తుండగా నిందితులు దొంగతనానికి వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతున్న క్రమంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని విచారించగా దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నట్లు తెలిపారు. రెండు బైక్ల విలువ సుమారు తొమ్మిది లక్షల 50 వేలు విలువ ఉంటుందని రిమాండ్‌(remanded)కు తరలిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఏది ఏమైనా దొంగతనాలు, దోపిడీలకు పాల్పడిన గంజాయి సేవించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన జనగామ సిఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై భరత్, కానిస్టేబుల్ బి కర్ణాకర్, ఎన్ సాగర్, బి కృష్ణ, టి కుమారస్వామిలను సీపీ వరంగల్, డీసీపీ, ఏసీపీలు అభినందించారు.

Leave a Reply