Deported – మూడో విమానం కూడా వ‌చ్చేసింది…

112మందితో అమృత‌స‌ర్ లో సి 24 ల్యాండిగ్
ఇప్ప‌టి వర‌కు 335 మంది రిట‌ర్న్
మ‌రో విమానాన్ని సిద్ధం చేస్తున్న ట్రంప్

అమృత‌స‌ర్ , ఆంధ్ర‌ప్ర‌భ – అమెరికాకు అక్రమంగా వలసవెళ్లిన వారిని తిరిగి వారి దేశాలకు పంపే ప్రక్రియ వేగంగా సాగుతోంది. మనదేశం నుంచి నుంచి అక్రమంగా వలస వెళ్లిన వారిని అమెరికా యుద్ధ విమానంలో తీసుకొచ్చి అమృత్‌సర్‌లో దింపేస్తున్న విషయం తెలిసిందే. గత రెండు వారాల్లో ఇప్పటికే రెండు సార్లు అమెరికా యుద్ధ విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్‌ కాగా.. సోమవారం తెల్ల‌వారుజామున‌ మూడో బ్యాచ్‌తో మరోసారి అమెరికా విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్‌ అయింది. ఈ సారి 112 మందిని పంపారు. వీరిలో ఎక్కువ మంది హర్యానాకు చెందినవారు ఉన్నారు. హర్యానాకు చెందిన 44 మందితో పాటు, 33 మంది గుజరాత్‌, 31 మంది పంజాబ్‌కు, ఇద్దరు ఉత్తరప్రదేశ్‌కు, హిమాచల్, ఉత్తరాఖండ్‌కు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నానని అధికార వర్గాలు తెలిపాయి.

ఇక శనివారం సాయంత్రమే 119 మందితో ఓ విమానం ల్యాండ్‌ అయింది. వెంటనే ఒక రోజు గ్యాప్‌ తర్వాత మరో 112 మందిని దింపేశారు. శనివారం వచ్చిన విమానంలో 67 మంది పంజాబ్‌, 33 మంది హర్యానాకు చెందినవారని అధికారులు తెలిపారు. మిగిలిన ఎనిమిది మంది గుజరాత్‌, ముగ్గురు ఉత్తరప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌కు చెందిన వారు ఇద్దరిద్దరు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌కు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు.

ఇక తొలిసారి ఫిబ్రవరి 5న అమెరికా నుండి బహిష్కరించిన భారతీయుల మొదటి బ్యాచ్, 104 మందితో సహా, అమెరికా సైనిక విమానంలో భారతదేశానికి తిరిగి వచ్చారు. అయితే ఇప్పటివరకు, అమెరికా నుండి భారతీయ అక్రమ వలసదారులతో వచ్చిన విమానాలు అమృత్‌సర్ విమానాశ్రయంలోనే ల్యాండ్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే నాలుగో విమానాన్ని కూడా ట్రంప్ సిద్ధం చేశారు. ఈ విమానంలో గురువారం భార‌త్ కు చేరుకోవ‌చ్చ‌ని అంటున్నారు.. ఇందులో కూడా సుమారు 113 మంది అక్ర‌మ‌వల‌స‌దారులు ఉన్న‌ట్లు స‌మ‌చారం,.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *