రహదారులు జలమయం…

ఉట్నూర్, (ఆంధ్రప్రభ) : మెంథా తుఫాన్ ప్రభావంతో అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలో బుధవారం రాత్రి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. గంటల తరబడి కురిసిన వర్షంతో రహదారులు జలమయమై, రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. పట్టణంలోని పలు లోత‌ట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. నిరంతర వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply