పది గ్రాముల బంగారం ధర మూడు వేలు తగ్గిందండి..

పది గ్రాముల బంగారం ధర మూడు వేలు తగ్గిందండి..

(ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్) : అమావాస్య రుచితో మంగళవారం పసిడి ప్రియుల గుండెల్లో దడ పుట్టించిన బంగారం ధర (GoldPrice) బుధవారం నేల చూపు చూసింది. రికార్డు స్థాయిలో ధర పడిపోయింది. పసిడి ప్రేమికులను .. రా..రా… అని బంగారు లక్ష్మీ పిలుస్తోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,580ల నుంచి రూ. 1,27,200లకు తగ్గింది. అంటే రూ.3,380లు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,21,700ల నుంచి. రూ.1,16,600లకు చేరి రూ.3,100లు తగ్గింది.

18 క్యారెట్ల బంగారం ధర రూ. 97,940 ల నుంచి రూ.95,400లకు చేరింది. అంటే బంగారం ప్రియులకు రూ.2,540లు ఊరట లభించింది. బంగారం ఆభరణాల (Gold jewelry) అవకాశమే లేదని సామాన్యులు అల్లాడిపోతున్న వేళ అకస్మాత్తుగా బంగారం ధర తగ్గటంతో పసిడి ప్రియులు ఖుషీఖుషీగా ఉన్నారు. చెన్నై బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయాలకు చేరటంతో బంగారం ప్రేమికులు కంగుతిన్నారు.


హైదరాబాద్ రూ.1,27,720 లు రూ.1,16,600 లు రూ.95,400లు
వరంగల్ రూ.1,27,720 లు రూ.1,16,600 లు రూ.95,400లు
విజయవాడ రూ.1,27,720 లు రూ.1,16,600 లు రూ.95,400లు
గుంటూరు రూ.1,27,720 లు రూ.1,16,600 లు రూ.95,400లు
విశాఖపట్నం రూ.1,27,720 లు రూ.1,16,600 లు రూ.95,400లు
చెన్నై రూ.1,27,720 లు రూ.1,16,600 లు రూ.95,400లు
కోల్కత్త రూ.1,27,720 లు రూ.1,16,600 లు రూ.95,400లు
ముంబై రూ రూ.1,27,720 లు రూ.1,16,600 లు రూ.95,400లు
ఢిల్లీ రూ.1,27,350లు రూ.1,16,750లు రూ.95,550లు
బెంగళూరు రూ.1,27,720 లు రూ.1,16,600 లు రూ.95,400లు
కేరళ రూ.1,27,720 లు రూ.1,16,600 లు రూ.95,400లు
అహ్మదబాద్ రూ.1,27,725లు రూ.1,16,650లు రూ.95,450లు
వడోదర రూ.1,27,725లు రూ.1,16,650లు రూ.95,450లు

Leave a Reply