తంగళ్లపల్లి, ఆంధ్రప్రభ : కుటుంబ భద్రత చూసుకోవడానికి మీరు ఎంతో అవసరమైని, ట్రాఫిక్ రూల్స్ పాటించి ఇంటికి క్షేమంగా వెళ్లాలని పోలీసులు అన్నారు. ఈ రోజు తంగళ్లపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో కుటుంబానికి మీరు కావాలి అనే నినాదంతో ట్రాఫిక్ రూల్స్‌పై ప్రత్యేక అవగాహన డ్రైవ్ నిర్వహించారు. ఎస్ఐ ఉపేంద్ర చారి ఆధ్వర్యంలో ఏఎస్ఐ జాన్ సిబ్బంది అవగాహన కల్పించారు. వాహనదారులకు హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలను రక్షించుకోవచ్చని వివరించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి కుటుంబ భద్రతను కాపాడాలని పోలీసులు పిలుపునిచ్చారు. హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, అబ్బాస్, శ్రావణ్ ఉన్నారు.
వాహనదారులతో పోలీసులు
