భీమారంలో యువ‌కుడి మ‌న‌స్తాపం

భీమారంలో యువ‌కుడి మ‌న‌స్తాపం

  • ఇంట్లో ఉరేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా భీమారం(Bhimaram)లోని ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా భీమారంలోని ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు గాలిపల్లి తారక్(Galipalli Tarak) (19) మంచిర్యాలలో కొన్ని నెలలుగా కారు మెకానిక్(Car Mechanic) పని నేర్చుకున్నాడు.

తారక్ శిక్షణ అనంతరం భీమారంలో సొంతంగా కారు మెకానిక్ షెడ్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తండ్రి రమేశ్ కు చెప్పగా అంత డబ్బు లేదని చెప్పడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఎస్సై శ్వేత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply